మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చెంజర్. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఈ సినిమా  పలు కారణాలవల్ల షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని భారీ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఒక యువ దర్శకుడు మీ రంగంలోకి దింపారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

ఇక అసలు విషయం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజుల నిర్మిస్తున్న ఈ భారీ సినిమా మొదలై చాలా కాలం అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు శంకర్ దర్శకత్వం వహించడంతో పలు సమస్యలు వచ్చాయి. ఇక శంకర్ దర్శకత్వంలో వహించే ఇండియన్ టు సినిమా పూర్తి చేయకుండా  షూటింగ్ చేయవద్దని లైకా నోటీస్ లు పంపినట్లుగా తెలుస్తోంది. దాంతో కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ని హోల్డ్ లో పెట్టారు. అయితే ఈ సినిమాకి రాంచరణ్ పర్సనల్ ప్రొఫెషనల్ పనులు కూడా ఆగిపోతున్నట్లుగా తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం నెల రోజులకు పైగానే రామ్ చరణ్ అమెరికాలోనే ఉన్నాడు.

దాంతో పాటు భార్య ఉపాసన ప్రసవం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు రామ్ చరణ్. ఇలా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది. దాంతోపాటు ఇండియన్ టూ సినిమాలో శంకర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. దీంతో అంతా గందరగోళం అవుతుంది. అయితే శంకర్ అందుబాటులో లేని కారణంగా దిల్ రాజు టీం ఒక సంచలన నిర్ణయం తీసుకుందట. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలన్న నేపథ్యంలో యువ దర్శకుడు శైలిష్ కొలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. సినిమాలోని కొంత పార్ట్ ను ఈ యంగ్ డైరెక్టర్ షూట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .యాక్షన్ సీన్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను శైలి పూర్తి చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. జులై 11వ తేదీ నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: