ఆమధ్య నితిన్ హీరోగా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇందులో హీరోయిన్గా రష్మీ క నటిస్తోందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఈ ఏడాదిలోనే మొదలుపెట్టడం జరిగింది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక పుష్ప-2 చిత్రంతో పాటు బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. తను నటిస్తున్న బైలింగ్వల్ మూవీ రెయిన్బో లో కూడా నటిస్తోంది రష్మిక.
ఇదే కాకుండా మరొక రెండు సినిమాలకు సైతం రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నితిన్ వెంకీ సినిమాకు డేట్లు కేటాయించడం రష్మికకు కష్టంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర బృందంతో చర్చించిన తర్వాత ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు సమాచారం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. దీంతో చిత్ర బృందం మరొక హీరోయిన్ ని వెతుకులాటలో పడ్డట్టుగా తెలుస్తోంది రష్మిక తప్పుకోవడంతో శ్రీ లీల ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనా రష్మిక నితిన్ కు గట్టి షాక్ ఇచ్చిందని పలువురు నిటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.