బాలీవుడ్ లో సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకుంది నటి మృణాల్ ఠాగూర్. వెండి తెరపై ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ సంపాదించుకుంది. టాలీవుడ్ లోకి మొదటిసారిగా సీతారామాం సినిమాతో పరిచయమైంది ఈ అందాల తార. అయితే ఈ సినిమాతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం ఈమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఆమె నాని సరసన 30వ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి ఒక సినిమాలో హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మద్దుగమ్మ. 

అయితే సినిమాలతో బిజీగా ఉంటూనే తన సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది మృణాల్ ఠాగూర్. తనకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తోంది ఈమె. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న మనసులోని ఒక పెద్ద కోరికను బయట పెట్టడంతో అది విన్న వారందరూ షాక్ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుండి తనకి ఒక పెద్ద కోరిక ఉందని ఆ కోరిక గురించి ప్రతిరోజు కలగంటూనే ఉంటుంది అంటూ తెలియజేసింది.

అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి మహేష్ బాబు తో నటించాలని ఆమె కోరిక అన్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేసింది. అంతేకాదు ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నాను.. ఆ కోరిక నెరవేరాలని త్వరలో నెరవేర్చుకుంటానని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ చేసిన ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.ఇక ప్రస్తుతం ఈమె చేతినిండా వరస సినిమాలతో బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: