ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అంకిత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమె తెలిపారు.అయితే తన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరని ఎమోషనల్ అయ్యారు.ఇక ఆర్తి అగర్వాల్ తాను చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం తను కూడా పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండేది ఇద్దరు చాలా సార్లు కలిసామని మా సిస్టర్ పెళ్లికి కూడా వచ్చిందని అంకిత తెలిపారు.
ఇక ఉదయ్ కిరణ్ నేను ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఇలా సినిమా ఓకే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.ఈ విధంగా సినిమా ఆగిపోయిన ఉదయ్ కిరణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము.హైదరాబాద్ లో ఉంటే తనని కలిసేదాన్ని కాకపోతే తనని కలిసే ఛాన్స్ లేకుండా పోయిందని ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా అందనంత దూరంలోకి వెళ్లిపోయారంటూ అంకిత ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆర్తి అగర్వాల్ ప్రమాదవశాత్తు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుని మరణించారు.