ఇకపోతే కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక గా చేసే పోస్టులు కనుక చూస్తే వీరిద్దరూ విడిపోయారని స్పష్టంగా అర్థం అవుతుంది.కోర్టు పర్మిషన్ తో వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురితో గడిపే అవకాశం ఈయనకు ఉంది. దీంతో ఈయన వారంలో ఈ నాలుగు గంటలే నాకు ఆనందకరమైన క్షణాలు అంటూ ఎప్పటి కప్పుడు తన కుమార్తెను మిస్ అవుతున్నానని పోస్టులు చేస్తూ ఉంటారు.ఇలా సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఈయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజాగా కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో.. మనం ఎలాంటి ప్రపంచం లో బ్రతుకుతున్నాం అంటే మోసం ఎప్పటి కీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు. కానీ నమ్మకం మాత్రమే ఆ పని చేయగలదు అంటూ ఈయన షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈయన నమ్మకం మోసం అంటూ ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్ట్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కచ్చితం గా ఈ పోస్ట్ శ్రీజ ను ఉద్దేశించే కళ్యాణ్ దేవ్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.