దానికి ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎస్పీ బాలు నిర్మాత శివ లింగ కృష్ణ ప్రసాద్ కి టైమ్ మిషన్ కథ గురించి చెప్పడంతో ఆ ఇద్దరూ తిరిగి సింగీతం గారిని కలవడానికి వెళ్లారట. అలా కథ డెవలపింగ్ విషయంలో టైమ్ మిషన్ గతంలోకి వెళ్లడం జరుగుతుంది. అయితే అప్పుడు ఏ వంశ కాలపు రాజుల కథను మరలా తీసుకోవాలని కసరత్తులు చేశారట సింగీతం శ్రీనివాసరావు.ఈ విషయమై జంధ్యాల గారిని కలవడంతో అప్పుడు జంధ్యాల గారు బాలకృష్ణ గారికి శ్రీకృష్ణదేవరాయలు గెటప్పు బాగా నప్పుతుందని, ఆ కాలాన్ని ఎంచుకుంటే బావుంటుందని చెప్పడంతో జంధ్యాలగారు ఈ సినిమాకి అలా సంభాషణలు రాశారట.
ఈ సినిమాకి మొదటగా పీసీ.శ్రీరామ్ వర్తమానంలో వచ్చే దృశ్యాలను తెరకెక్కించారట. ఆ తర్వాత అనారోగ్య పరిస్థితుల వలన ఆయన తప్పుకోవడంతో వి.ఎస్.ఆర్ స్వామిని కెమెరామెన్ గా తీసుకొని సినిమాలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దృశ్యాలను తీశారట. అప్పటికి ఆయన డేట్స్ అయిపోవడంతో కబీర్ లాల్ అనే మరొక కెమెరామెన్ ని తీసుకొని సినిమాలోని భవిష్యత్తులో వచ్చ దృశ్యాలను చిత్రీకరించడం జరిగిందట. అలా ఈ సినిమాలో ముగ్గురు కెమెరామెన్ లు వర్క్ చేయడం నిజంగా రికార్డ్ అని చెబుతూ వుంటారు.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో డేట్స్ ఇబ్బంది ఉండకూడదని ప్రొఫెసర్ గా టిను ఆనంద్, విలన్ గా అమ్రిష్ పురి, తెనాలి రామకృష్ణుడి గా చంద్రమోహన్ లు నటించగా సినిమాలో ప్రధానమైన కృష్ణకుమార్ పాత్ర కోసం కమలహాసన్ ని చేయమని అడిగారట. ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఎస్పీ బాలు సూచన మేరకు బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలు, కృష్ణ కుమార్ గా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజైన తరువాత ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.