ఈ సమయంలోనే బవన్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్న జాన్వి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి గురించి తెలియచేయడం జరిగింది.. ముఖ్యంగా తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని తెలియజేసింది. తను నటిస్తున్న మొదటి సినిమా ధడక్ కోసం వర్క్ చేస్తున్న సమయంలో తన తల్లి మరణించిందని తెలియజేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తాను బిజీగా ఉన్నారని కానీ ఆమెలోని లోటు ఎవరు తీర్చలేకపోయారని తెలియజేసింది జానకి కపూర్.
ఆమె లేని సమయం ఎలా గడిచింది అన్న విషయం అస్పష్టంగానే ఉంది నాకు సరిగ్గా గుర్తులేదు ఏమైనాప్పటికీ ఆ నెల మొత్తం తనకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని చాలా కాలం పాటు అలాగే ఉండిపోయానని ఏదో ఒక పని చేస్తూ జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టంగా అనిపించిందని ..ఆ బాధ నుంచి బయటపడేందుకు ఒక పెద్ద యుద్ధమే చేశాను అంటూ జాన్వీ కపూర్ తెలుపుతోంది. శ్రీదేవి తనని లడ్డు అని పిలిచేదని తెలియజేసింది. 2018 దుబాయిలో శ్రీదేవి మరణించింది. జాన్వీ కపూర్, ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు