ఇక అకీరా నందన్, ఆద్యల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నాడని, వారికి కావాల్సినవన్నీ అందిస్తున్నాడు అని గతంలో చాలా వార్తలు వచ్చాయి.ఇక పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా.. రేణు మాత్రం పిల్లలతోనే తన జీవితాన్ని కొత్త కొత్తగా మార్చుకుంటుంది.ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో బుల్లితెరపై రీఎంట్రీ కూడా ఇచ్చింది రేణు. ఢీ డ్రామా జూనియర్స్ లో జడ్జిగా కొంతకాలం చేసింది.ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరంగా ఉండగా కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అందరికీ టచ్ లో ఉంటుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ కు మంచి గౌరవం ఇస్తూ ఉంటారు.
ఇక రేణు ప్రతిసారి తన పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. సమయం దొరికితే తన పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాల పట్ల బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.తనపై ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే వెంటనే సోషల్ మీడియాలోనే వారిపై ఫైర్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది.ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకుంది. అందులో తనవి ఒకప్పటి ఫొటోస్ అందంగా ఎడిట్ చేసి ఉంచడంతో.. దానిని తన కొడుకు అకీరా కొన్ని నిమిషాలలో ఈ ఫొటోస్ ని ఎడిట్ చేశాడు అని తెలిపింది. కానీ ఆ ఫోటోలన్నీ భయంగా ఉన్నాయి అన్నట్లు కామెంట్ చేసింది.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వగా.. ఆ వీడియో చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు. అచ్చం సీత లాగా ఉన్నావు అని.. ఆది పురుష్ సినిమాలో మీరే సీతగా చేస్తే బాగుండేది అని కామెంట్లు చేస్తున్నారు.