4 కె టెక్నాలజీతో ఈ తరం ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగానే ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.వైజయంతి మూవీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శ్రీదేవి కోసం విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీదేవి అద్భుతమైన నటన కోసం సినీ ప్రేక్షకులు అప్పట్లో థియేటర్ల వద్ద క్యూ కట్టేవారట. అందుకోసమే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అవ్వబోతోంది అని తెలిసి పలువురు అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది .అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రీ రిలీజ్ పై స్పష్టత అయితే రాలేదు.. కానీ వచ్చే నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ క్లాసికల్ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవి ఇంద్రలోకం నుంచి దిగివచ్చిన దేవకన్య పాత్రలో అద్భుతంగా నటించింది ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ ఒక మరుపురాని సినిమా అని చెప్పవచ్చు. ఇందులో శ్రీదేవి నటన చూస్తే అచ్చం దేవతలు ఇలాగే ఉంటారేమో అని అంతగా శ్రీదేవి తన నటనతో మైమరపించింది అందుకే ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఇప్పటికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఫ్రీ రిలీజ్ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.