'ఆదిపురుష్' సినిమాతో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే 'సలార్' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది.యూట్యూబ్ లో కేవలం 24 గంటల్లోనే 83 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటివరకు యూట్యూబ్లో సలార్ టీజర్ కి 120 మిలియన్లవ్యూస్ దక్కడం విశేషం. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి.

 కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కి ముందే తాజాగా ఈ సినిమా ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకి దక్కని రికార్డు ప్రభాస్ సలార్ సినిమాకి దక్కింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 'సలార్' సినిమాని ఓవర్సీస్ లో యూఎస్ఏ కు చెందిన ప్రత్యంగిరా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అయితే ఈ సినిమాని నార్త్ అమెరికాలో ఏకంగా 1979 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూట్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఓ తెలుగు సినిమా నార్త్ అమెరికాలో ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇక ఈ 1979 లొకేషన్స్ లో సెప్టెంబర్ 27న సలార్ ప్రీమియర్ షోలు ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. 

ఈ రికార్డు ఇప్పటివరకు మరే ఇండియన్ సినిమాకి సాధ్యం కాలేదు. కేవలం ప్రభాస్ కి మాత్రమే ఇది సొంతమైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి తెగ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా సలార్ రేపు రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం గ్యారెంటీ అంటున్నారు. కే జి ఎఫ్ సినిమాను నిర్మించిన హోం బలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈశ్వరి రావ్, శ్రీయ రెడ్డి, రావు రమేష్, సప్తగిరి, టీను ఆనంద్ తదితరులు ఇతర కీలకపాత్రను పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పార్ట్ వన్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: