మెగా హీరో సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల విరుపాక్ష సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు యువ  హీరో సాయిధరమ్ తేజ్. ఇక తాజాగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి 'బ్రో' సినిమాలో నటిస్తున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. కాగా సాయిధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా ఈనెల 28న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోని సాయి ధరం తేజ్ తన తదుపరి సినిమాల  కోసం ఆరు నెలల విరామాన్ని తీసుకోబోతున్నారని అధికారికంగా ప్రకటించి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.

దీంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు ఎందుకు ఉన్నట్టుండి ఆరు నెలల విరామాన్ని ప్రకటించాడు అని రకరకాల సందేహాలను తమ తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోని సాయంత్రం బ్రో సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే ఈలోగా తన శారీరక ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటానని రాబోయే సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావద్దనేదే తన ఉద్దేశమని సాయి ధరంతేజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఈ క్రమంలోని చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని ఈసారి మరింత బలంగా తిరిగి వస్తాను అని నేను సంపూర్ణంగా కోలుకోవాలని ఈ ఆరు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు సాయి ధరంతేజ్. దీంతో మెగా అభిమానులు కాస్త శాంతించారు. దీంతో సాయి ధరంతేజ్ చెప్పిన వార్త విని మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ కోలుకొని తెలుగు సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సాయి తేజ్ బ్రో సినిమాతో కూడా అదే రేంజ్ లో హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: