కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ బజ్ ఏర్పడుతోంది. దీంతో ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజు రీసెంట్గా కమల్ హాసన్ తో కలిసి విక్రమ్ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక విజయ్ తో కూడా మాస్టర్ వంటి సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్టుగా అందుకోవడం జరిగింది. అలాగే ఖైదీ సినిమా అని కూడా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగు ఆడియన్స్ లో కూడా డైరెక్టర్ లోకేష్ కనకరాజు చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
లియో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. దీంతో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టడానికి లియో సినిమా ఫర్ఫెక్ట్ అవుతుందని ఈ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రూ.20 కోట్లతో ఈ సినిమా రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగులో అత్యధిక హైయెస్ట్ సేల్స్ దక్కించుకున్న చిత్రంగా పేరు సంపాదించింది. ఏడాది అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు.