హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అనంతరం హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా దారుణంగా పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇకపోతే అనన్య మాత్రం తన నాజూకు అందాలు ఆరపోస్తూ విజయ్ దేవరకొండ తో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో

 ఈ సినిమా తో అనన్య కి మంచి గుర్తింపు వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ  సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో ఆమెకి తెలుగులో మరొక సినిమాలో అవకాశం రాలేదు. అనంతరం ఆమె తెలుగులో ఆఫర్లు రాకపోయేసరికి బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది.  ఇక ఈ యంగ్ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు ఆదిత్యా రాయ్ కపూర్ తో పీకల్లోతు  ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు అక్కడ వీరిద్దరూ వన్ వీల్ స్కూటర్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న

 ఫోటోలో వీడియోలు సోషల్ మీడియా వేదికగా లీక్ ఎంత వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. దాంతోపాటు రెస్టారెంట్ లో కూర్చుని ప్రేమగా ఒకరి కళ్ళలో ఒకరు చూస్తున్నట్టు ఒక ఫోటోని సైతం లీక్ చేయడంతో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇక ఆదిత్య రాయ్ కపూర్ ఇటీవల  విడుదలైన నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో స్టైలిష్ పర్ఫామెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు నైట్ మేనేజర్ సిరీస్లో శోభిత ధూళిపాలతో కలిసే బోల్డ్ సన్నివేశంలో రొమాన్స్ చేశారు ఈ యువ నటుడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: