కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కూడా విపరీతమైన స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోని సూర్య పుట్టినరోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే జూలై 23వ తేదీసూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.అయితే ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సూర్య ఇద్దరి అభిమానులు మరణించారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్( venkatesh ) , పోలూరు సాయి( Sai ) కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ పెను విషాదం సూర్య అభిమానులని కలచి వేసింది.

సూర్య పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ ఇద్దరు అభిమానులు ఆయన ఫ్లెక్సీ కట్టడం కోసం వెళ్లారు అయితే కరెంట్ షాక్ తగిలి వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ విషయం సూర్య వరకు చేరడంతో సూర్య తమ అభిమానుల మృతిపై స్పందించారు. ఈ క్రమంలోనే మరణించిన అభిమానుల కుటుంబ సభ్యులతో ఈయన వీడియో కాల్  మాట్లాడారు.ఇలా తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా అభిమానులు మరణించడంతో సూర్య ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే తన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సూర్య చనిపోయిన తన అభిమానులను తిరిగి తాను తీసుకురాలేను కానీ వారు లేని లోటు కనిపించకుండా కుటుంబ బాధ్యతలను తానే తీసుకుంటానని ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా సూర్య ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఓ అభిమాని కుటుంబంలో మగదిక్కు ఎవరూ లేరు.దీంతో ఆ అభిమాని సోదరి డిగ్రీ పూర్తి చేయడంతో తమ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా సూర్య ఆ రెండు కుటుంబాలకు హామీ ఇవ్వడంతో సూర్య అభిమానులు మరోసారి ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా చనిపోయిన తోటి అభిమానుల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: