ఈసంవత్సరం ‘దసరా’ సినిమాతో 100 కోట్ల హీరోగా మారిన నాని తనకు గతంలో కలిసి వచ్చిన క్రిస్మస్ సెంటిమెంట్ ను నమ్ముకుని ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కాబోతోంది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ఆధారంగా నిర్మాణం జరుపుకున్న ఈమూవీలో క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను ఏమాత్రం లెక్కచేయకుండా వెంకటేష్ తన కెరియర్ లో 75వ సినిమాగా నటించిన ‘సైంధవ్’ మూవీ విడుదల కాబోతోంది ఈమూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలను ఏమాత్రం లెక్కచేయకుండా సుధీర్ బాబు కూడ రంగంలోకి దిగుతున్నాడు. ‘హరం హర’ అన్న టైటిల్ తో ఒక డిఫరెంట్ కథను ఎంచుకుని క్రిస్మస్ రేస్ లోకి వస్తున్న సుధీర్ బాబు ఈమూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా అతడి సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో ఈ హీరోకు ఒక హిట్ కావాలి.
ఈ తెలుగు సినిమాలతో షారూఖ్ ఖాన్ ‘డంకీ’ కూడ విడుదల కాబోతోంది. రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వం వహించిన ఈమూవీ పై కూడ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలలో ఒక్క సుధీర్ బాబు సినిమా తప్ప మిగతా సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నాయి. క్రిస్మస్ కు సంక్రాంతికి మధ్య కేవలం మూడు వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ చిన్న గ్యాప్ లోనే ఈ క్రిస్మస్ రేస్ కు విడుదల అవుతున్న సినిమాలు కలక్షన్స్ విషయంలో తమ సత్తాను చాటుకోవాలి..