‘శివ’ మూవీతో నాగార్జున కు ఎంతపేరు వచ్చిందో ఆపేరుతో సమానంగా జెడి చక్రవర్తికి కూడ చాలమంచి పేరు వచ్చింది. ఆతరువాత కృష్ణవంశీ తీసిన ‘గులాబీ’ తో జెడి చక్రవర్తి హీరోగా సెటిల్ అవ్వడంతో అతడు చాల బిజీ హీరోగా మారిపోతాడని చాలామంది భావించారు. ఆతరువాత అతడు హీరోగా నటించిన కొన్ని సినిమాలు విజయవంతం అయినప్పటికీ పాపులర్ హీరోగా అతడు పెద్దగా రాణించలేకపోయాడు.



దీనితో అతడు దర్శకుడుగా మారి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతడి ప్రయత్నాలు పెద్దగా రాణించలేదు. ఆతరువాత కాలంలో నెమ్మదిగా జెడి చక్రవర్తి హవా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అతడు వేసిన పంచ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. వచ్చేనెల హాట్ స్టార్ లో రిలీజ్ కాబోయే ‘దయా’ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో జెడి ఈపంచ్ వేశాడు.





ఆఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి జెడి ని ఉద్దేశించి ‘సత్య’ మూవీ తర్వాత మీకు స్క్రాప్ పీరియడ్ వచ్చింది కదా అని అడగగానే జెడి ఏమాత్రం తడుముకోకుండా అలాంటి పరిస్థితి తనకు వచ్చింది కాబట్టే తనపై ఇలాంటి ప్రశ్నలు పడుతున్నాయని తాను కూడ బిజీగా ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఎవరు వేయలేరు కదా అంటూ జెడి సెటైర్ వేశాడు. ఇది ఇలా ఉండగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ‘దయా’ లో జెడి చక్రవర్తి ఒక చెవి పనిచేయని డ్రైవర్ గా నటించాడు. ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ తరువాత తన కెరియర్ కు మరో బ్రేక్ వస్తుందని జెడి ఆశిస్తున్నాడు.



జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తీస్తున్న ‘దేవర’ మూవీలో కూడ జెడి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తన గురువు రామ్ గోపాల్ వర్మను కూడ అవసరం అనుకుంటే విమర్శించే ముక్కుసూటి తనం ఉన్న జెడి చక్రవర్తి అలాంటి వ్యక్తిత్వం వల్లనే పెద్దగా రాణించలేకపోయాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: