ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలలో ఆది పురుష్ చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.. ఇక తర్వాత బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా రూ .50 కోట్ల గ్రాస్ వసూల్.. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య.. రూ.49.5 .. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ రూ.49 కోట్ల గ్రాస్ వసూల్.. నాని నటించిన దసరా సినిమా రూ .38 కోట్ల రూపాయలు గ్రాస్ వసూల్ సాధించినట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో కొంతమంది స్టార్ హీరోలు సైతం ఇంకా తమ సినిమాలను విడుదల చేయడం లేదు.. ఈ ఏడాది చివరి కల్లా కొంతమంది స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతూ ఉన్నాయి.. ముఖ్యంగా కంటెంట్ పరంగా స్టోరీ బాగుంటే చాలు ఆ సినిమాని ప్రేక్షకులు సైతం సక్సెస్ఫుల్గా హీట్ టాక్ తో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ కేవలం ఈ ఐదు చిత్రాలే అత్యధికంగా గ్రాస్ వసూలు సాధించిన చిత్రాలుగా సినీ విశ్లేషకులు తెలియజేయడం జరిగింది. మరి మిగిలిన ఆరు నెలల వ్యవధిలో మరిన్ని చిత్రాలు ఈ రికార్డులను మించుతాయేమో చూడాలి మరి. తమ హీరోల చిత్రాలు విడుదల కావాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.