తమ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు చేసే కోలాహలం అంతా ఇంత కాదు.. ముఖ్యంగా థియేటర్ల వద్ద పూలమాలలు డాన్స్ విజిల్స్ వంటివి చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇక థియేటర్లో తమ హీరో బొమ్మ కనపడగానే నాన హంగామా చేస్తూ ఉంటారు అభిమానులు.. థియేటర్లో కొత్తగా విడుదలైన చిత్రాలు మొదటి సో చూడడానికి అభిమానులు తెగ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకోసం టికెట్ ధర ఎంత ఉన్నా సరే మొదటి రోజు మొదటి షో చూడాలనేదే వారి కోరికగా ఉంటుంది.


కానీ అంతటితో సినిమా చూసి వస్తారనుకుంటే పొరపాటే అలా కుదరకుండా సినిమాలలో నచ్చిన సన్నివేశాలను సైతం వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో పలు రకాల యాప్ లలో కూడా అప్లోడ్ చేయడం వంటివి లేకపోతే వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక విధంగా పైరసీగా అనిపిస్తుందట. అందుకే ఇక మీదట థియేటర్లలో వీడియోలు లేదా ఫోటోలు తీయకుండా పలు కఠినమైన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని కీలకమైన మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కఠినమైన నిబంధనలు కూడా తీసుకువచ్చే విధంగా పలు సన్న హాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ చట్టం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనధికారికంగా ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలు థియేటర్లలో తీయకూడదని ఇలా చేసిన వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష తోపాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో ఇక మీదట సినిమాల క్లిప్పులను స్టేటస్ గా పెట్టేవారికి జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరి ఇలా అయినా సరే పైరసీని అరికట్టేందుకు కుదురుతుందేమో చూడాలి మరి.. మరి ఇలాంటి విషయాలను అభిమానులు ఏమాత్రం ఒప్పుకుంటారు తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: