తెలుగు సినీ పరిశ్రమలో చలనచిత్ర వాణిజ్యమండలి..(TFCC) ఎన్నికలు నిన్నటి రోజున జరిగాయి.. ఫలితాలు కూడా సాయంత్రం నాలుగు గంటలనుకే విడుదల చేయడం జరిగింది. అయితే అందిన సమాచారం ప్రకారం దిల్ రాజ్ ప్యానెల్ ఎన్నికలలో గెలవడం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 891 ఓట్లు పోల్ అవ్వగా.. ఇందులో 563 ఓట్లు దిల్ రాజ్ ప్యానెల్ సాధించగా సి కళ్యాణ్ ఫ్యాన్ లకు 497 ఓట్లు మాత్రమే వచ్చాయి. దిల్ రాజ్ ప్యానెల్ లో నిర్మాతల విభాగానికి 12 కి ఏడు విజయాలు అందుకోగా స్టూడియో విభాగంలో నాలుగు మూడు విజయాలను అందుకోవడం జరిగింది.


పంపిణీ రంగంలో పోరాటం చాలా కఠినంగా ఉందన్నట్లుగా తెలుస్తోంది. పంపిణీదారులలో ఇరుపాన్నెల నుండి ఆరు సభ్యులు రేసులో గెలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..TFCC బలోపేతం చేసేందుకు కాను ముందుకు వచ్చి పోటీ చేశానని దిల్ రాజ్ సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఎన్నికల ముందు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. చిన్న చిత్రాలకు అండగా ఉంటానని సిని పరిశ్రమను మరో స్థాయికి తీసుకు వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది దిల్ రాజ్..


కేవలం పదవి కోసమే తాను ఎన్నికలలో పాల్గొనడం లేదంటూ తెలియజేశారు.ఎన్నికల ముందే ఊహించినదే జరిగింది చివరికి 2023-2025 వరకు చాంబర్ కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగానే కాకుండా డిస్టిబ్యూటర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇక తన బ్యానర్ పైన పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నప్పటికీ ఇలా పలు రకాల వాటిలో పాల్గొంటూ మంచి పాపులారిటీ సంపాదించారు.. చిన్న చిన్న సినిమాలకు కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటారు దిల్ రాజ్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజ్ అనే చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: