టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో  స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేసినప్పటికీ ఈ మధ్య మాత్రం ఆమెకి సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గాయి. ఈ నేపథ్యంలో నే ఆమె చేస్తున్న ఒకే ఒక్క సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి కలిసి జంటగా నటించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా చాలా రోజుల నుండి వాయిదా పడుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే విడుదల చేయాలి అని అనుకున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమాని వాయిదా వేశారు. దీంతో అనుష్క శెట్టి అభిమానులు పైగా ఫీల్ అవుతున్నారు అని చెప్పాలి. ఆగస్టు 4న విడుదల చేస్తామని మొదట చిత్ర బృందం చెప్పారు. కానీ తాజాగా.అందుతున్న  సమాచారం మేరకు ఇప్పుడు రిలీజ్ చేయడం లేదు అంటూ మెకర్స్ అధికారికంగా చెప్పడంతో ఒక్కసారిగా స్వీటీ అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో పూర్తి కాలేదు అని ఆగస్టు 4న వాయిదా వేస్తున్నాం అని..

మరొక కొత్తది త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించారు చిత్రబృందం. అయితే ఆ కొత్త రిలీజ్ డేట్ పై తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఆగస్టు 4 నుండి వాయిదా వేసిన డేట్ ఆగస్టు 18న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ఈ సినిమాని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. రారా కృష్ణయ్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: