టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె రవితేజ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ బ్యూటీ ఏకంగా 8 సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మొదలుకొని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ 12వ చిత్రం, నితిన్ మూవీ.. ఇలా మొత్తం 8 మంది స్టార్ హీరోలతో నటించడానికి సిద్ధం అయ్యింది.

ఇకపోతే ఇప్పటికే కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తెలుగులో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ..  శ్రీ లీల దూకుడు కి అడ్డుకట్ట వేయలేక పోతోంది . అయితే ఈమె దూకుడు కి అడ్డుకట్ట వేయడానికి ఉన్నది నేనే అంటూ ముందుకు వచ్చేసింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె తన నటనతో మరిన్ని మార్క్ లు దక్కించుకుంది. అలాగే రవితేజ ఖిలాడి సినిమాలో కూడా తన నటనతో మెస్మరైజ్ చేసింది.

ఇక ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్థానాన్ని ఆక్రమించింది. ఇలా  వరుసగా చూసుకున్నట్లయితే ఈమె చేతిలో కూడా నాలుగు సినిమాలు ఉండడం గమనార్హం. శ్రీ లీల 8 సినిమాలతో బిజీగా ఉంటే ఆమెకు పోటీగా మీనాక్షి చౌదరి కూడా నాలుగు సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారుతుంది. ఈమెకు ఇంకా కొన్ని స్టార్ హీరోల సినిమాలలో అవ కాశాలు వస్తున్నట్లు సమాచారం. అందుకే  మరింత ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది మీనాక్షి చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: