స్టార్ హీరోయిన్ హన్సిక కి భర్త కంటే ఆ హీరోనే ఎక్కువ ఇష్టమా.. బెడ్ రూమ్ నిండా ఆ హీరో ఉన్న ఫోటోలతోనే నింపేసిందా.. నిజంగానే ఆ హీరో అంటే ఇష్టమా అంటే అవునని అంటుంది హన్సిక.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించిన హన్సిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది.ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. అయితే హీరోయిన్ హన్సిక గురించి ఎప్పుడు ఏ వార్త వినిపించినా కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇక గత ఏడాది తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కిన హన్సిక తన బెడ్ రూమ్ లో మాత్రం ఆ హీరో ఫొటోస్ నే పెట్టుకుంటుందట. అవును మీరు వినేది నిజమే.

తన బెడ్రూంలో సోహైల్  కి తనకి సంబంధించిన ఒక్క ఫోటో తప్ప మిగిలిన ఫోటోలన్నీ సూపర్ స్టార్ రజనీకాంత్ వే ఉంటాయట. రజనీకాంత్ అంటే ఎంత ఇష్టం అంటే తన బెడ్రూమ్ నిండా ఆ హీరో ఫొటోస్ తో నింపడం చూసి హన్సిక భర్త సోహైల్ సైతం ఆశ్చర్యపోయాడట. నీకు రజినీకాంత్  అంటే ఇంత పిచ్చేంటే బాబు అని ప్రతిసారి అడుగుతాడట. కానీ హన్సిక మాత్రం నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం.

అందుకే ఆయనకి సంబంధించిన వివిధ రకాల ఫొటోస్ నేను నా బెడ్ రూమ్ గోడ పై పెట్టుకుంటాను. ఈ విషయంలో మీరు కూడా అడ్డు చెప్పకూడదు అని చెప్పిందట. ఇక సోహైల్ కూడా ఏమీ అనకపోవడంతో రజనీకాంత్ కి సంబంధించిన ఎన్నో రకాల ఫోటోలను హన్సిక తన బెడ్రూంలో పెట్టుకుంటుందట. అంతేకాదు కొత్త సినిమాకు సంబంధించి ఆయన కొత్త లుక్ బయటపడితే అందుకు సంబంధించిన ఫోటో కూడా ఫ్రేమ్ కట్టించి మరీ తన బెడ్ రూమ్ లో పెట్టుకుంటుందట. ఇలా రజనీకాంత్ అంటే హన్సిక కు చచ్చేంత ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి: