యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను సైతం విడుదల చేశారు మేకర్స్. 

అందుకు ఊహించిన విధంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా జాన్విక బోర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఐదున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే తెలియజేశారు.ఈ క్రమం లోనే ఈ సినిమా కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ కి ముందు ఇంకా 250 రోజులో ఉంది. అంటూ కొరటాల శివ వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక వీడియోని తమ అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతుంది. 

అయితే ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తే గతంలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. ఆ మృగాలకు భయం అంటే తెలియదు దేవుడంటే భయం లేదు. చావంటే అసలు భయం లేదు. కానీ ఒక్కడంటే చాలా భయం అంటూ.. దేవర అంటూ గతంలో కొరటాల శివ ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు ఈ వీడియోని సింక్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ యువసుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. దీంతో తాజా సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: