1930లో తంజావూరు దగ్గర నన్నిలం అనే గ్రామంలో జన్మించిన ఆయన 50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 100 చిత్రాలకు పైగా దర్శకుడిగా పని చేశారు. పద్మశ్రీ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నర్గీస్ దుత్త అవార్డుతో పాటు అనేక జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న రజినీకాంత్, కమలహాసన్ వంటి వారు బాలచందర్ ను తమ గురువుగా భావించేవారు. అయితే ఇలాంటి ఒక గొప్ప మహనీయుడు సినిమాలలో నటించిన తర్వాత జయప్రదకు చాలా కాలం అవకాశాలు రాకుండా చేశాడట.
సహజత్వానికి ఉట్టిపడేలాగా మధ్యతరగతి జీవితాలను దృష్టిలో పెట్టుకొని పలు ప్రయోగాలు చేసే బాలచందర్ తెరకెక్కించిన చిత్రాలలో అంతులేని కథ కూడా ఒకటి. ఈ సినిమాలో బాలచందర్ గారికి హీరోయిన్ క్యారెక్టర్ కి ఒక యాక్టర్ కావాలి.. హీరోయిన్ గా అనేక లక్షణాలు ఒకేసారి చూపించగలిగాలి. పొగరు, కోపం, లావణ్యంతో పాటు ఆలోచన పరురాలైన వ్యక్తిత్వం కూడా ఆమెలో ఉండాలి. అయితే ఈ పాత్ర కోసం జయప్రదను సజెస్ట్ చేశారట. ఈ సినిమాలో రజనీకాంత్ ది జయప్రద అన్నయ్య పాత్ర . ఏ బాధ్యతలు లేకుండా తాగుబోతు ఇంటి పెద్ద పాత్ర రజనీకాంత్ పోషించారు.
ఇక సినిమా విడుదలై మంచి హిట్ సాధించింది. అయితే దర్శకుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు సుమారుగా ఆరు నెలలపాటు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదట. ఎందుకంటే ఈ చిత్రంలో ఆమె చేసిన క్యారెక్టర్ ఆమె కెరియర్ కు శాపంగా మారింది. గంభీరంగా కనిపించేసరికి ఆమెను సౌమ్యమైన పాత్రలలో, పాటలలో చూపిస్తే జనాలు ఒప్పుకుంటారో లేదో అని దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదట. బాలచందర్ ఇచ్చిన క్యారెక్టర్ వల్ల సుమారుగా ఆరు నెలల పాటు ఇంటికే పరిమితమైంది.