అల్లు అర్జున్ స్నేహ రెడ్డి జంట చూస్తే చాలామంది ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు. అంతే కాదు అల్లు అర్జున్ పెద్ద హీరో అయినప్పటికీ స్నేహ రెడ్డి కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ రావడం కోసం ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తీయించుకుంటూ ఒక హీరోయిన్ లాగే తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.అయితే ఈ విషయంలో కొంతమంది నెగటివ్ గా ఆలోచిస్తే మరి కొంత మంది పాజిటివ్ గా కామెంట్లు పెడతారు.ఇది పక్కన పెడితే..అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్ళికి ముందే స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల ఒక ఊహించని కండిషన్ పెట్టిందట. మరి ఆ కండిషన్ ఏంటో తెలుసుకుందామా.. అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డిని ఇచ్చి పెళ్లి చేయడం అల్లు నిర్మలకి అస్సలు ఇష్టం లేదట.

ఎందుకంటే అప్పటికే తన కొడుక్కి తన బంధువుల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేయాలని చూసి పెట్టిందట.కానీ సడన్ గా బన్నీ స్నేహ రెడ్డి ని ప్రేమిస్తున్నాను అనే విషయం ఇంట్లో చెప్పడంతో తన ఆశలన్నీ ఆవిరైపోయాయి. కానీ అల్లు నిర్మల ఊరుకుంటారా..పెళ్లి మాత్రం నేను చూసిన అమ్మాయిని చేసుకోవడం లేదు..కనీసం పెళ్లి తర్వాత జరిగే ఆ విషయంలోనైనా నా మాట తప్పనిసరిగా వినాలి అని అల్లు అర్జున్ కి చెప్పారట.సరే మమ్మీ నువ్వు ఏం చెప్పినా వింటాను అని అల్లు అర్జున్ అనే సరికి స్నేహ రెడ్డి దగ్గరికి అల్లు నిర్మల వెళ్లి నువ్వు పెళ్లి చేసుకున్నాక పెళ్లయిన రెండు మూడు సంవత్సరాలలోపే మా ఇంటికి మనవడో మనవరాలో రావాలి.. అంతేగానీ పెళ్లి తర్వాత పిల్లల కోసం గ్యాప్ తీసుకుంటాం అంటే కుదరదు. నాకు మాత్రం కచ్చితంగా పెళ్లైన రెండు మూడు సంవత్సరాలలోపు మనవడో మనవరాలో కావాలి .

ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నా కొడుకుని పెళ్లి చేసుకో అంతేకానీ పెళ్లి తర్వాత పిల్లలను కనకుండా కొన్ని రోజులు టైం తీసుకుంటాం అని చెబితే ఇలాంటి వన్నీ కుదరదు అని స్నేహారెడ్డి  కి కండిషన్ పెట్టిందట అల్లు నిర్మల. అయితే ఈ కండిషన్ కి మొదట్లో భయపడిన స్నేహ రెడ్డి ఆ తర్వాత ఓకే చెప్పిందట. ఇక అత్తకి ఇచ్చిన మాట ప్రకారమే పెళ్లయిన రెండు సంవత్సరాల లోపు అల్లు అర్జున్ దంపతులకు అల్లు అయాన్ జన్మించాడు. ఇలా పెళ్లికి ముందే స్నేహ రెడ్డికి అల్లు నిర్మల కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: