సంగీతాన్ని అనురుద్ అందిస్తూ ఉన్నారు. దాదాపుగా రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా రూ.400 కోట్ల రూపాయల వరకు ఫ్రీ రిలీజ్ జరిగినట్లుగా బాలీవుడ్లో పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోని హక్కులను సైతం దాదాపుగా రూ.23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాని ఇంత ధరకు కొన్నట్లు అయితే కనీసం ఈ సినిమా రూ.45 కోట్ల రూపాయల వసూలు సాధించాల్సి ఉంటుంది.
ఇక షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా రూ .56 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా ప్రొడ్యూసర్ తెలియజేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఈసారి అంతకుమించి కలెక్షన్లు రాబడుతుందని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా సరైన సక్సెస్ లాగా స్టార్ హీరోలు అందరూ కూడా చాలా సతమతమవుతున్నారు. అలాంటి సమయంలోనే పటాన్ సినిమా కాస్త ఊపిరిని అందించింది మరి జవాన్ సినిమాతో ఏ మేరకు బాలీవుడ్ ఇండస్ట్రీని మారుస్తారు చూడాలి మరి.