ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ బిజీగా ఉండగా త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక రెండవ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకోగా అయితే ఆ పాత్రను రష్మిక చేస్తున్నట్లు సమాచారం. దీంతో శ్రీ లీల హిట్ లిస్టులో ఇప్పుడు చరణ్ కూడా చేరిపోయాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.
మరొకవైపు ఈ మెగా హీరోలకు హిట్ హీరోయిన్లను తమ సినిమాలలో పెట్టుకునే అలవాటు ఎప్పటినుంచో ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా శ్రీలీల ఖాతాలో ఒక సక్సెస్ లభించినా రామ్ చరణ్ ఖాతాలో మరో సక్సెస్ లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాంచరణ్ విషయానికొస్తే.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇక పాపతో రెండు నెలలు గడపడానికి సినిమాలకు బ్రేక్ చెప్పిన ఈయన త్వరలోనే తన సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.