బ్రో మూవీ తో పాటు సినీ పరిశ్రమ పైన కూడా ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్లు గత కొద్ది రోజుల నుంచి చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వార్తల పైన బ్రో సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మినిస్టర్ మాట్లాడిన మాటలను తాను సీరియస్గా తీసుకోవడం లేదంటే తెలియజేశారు. అంతేకాకుండా ఆయన చేసిన కామెంట్స్ గాలి మాటలు అంటూ కూడా పేర్కొనడం జరిగింది. బ్రో మూవీలో పృథ్వి చేసిన శ్యాంబాబు పాత్ర అంబాటి రాంబాబును పోలి ఉందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పైన కూడా అంబాటి స్పందించడం జరిగింది.


తనను కించపరిచాలని బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ శ్యాంబాబు పాత్రను పెట్టారని రాంబాబు ఆరోపించారు. టిడిపి నాయకులు ఇచ్చిన డబ్బుతోనే విశ్వప్రసాద్ బ్రోచిత్రాన్ని తీశాడు అంటూ కూడా పేర్కొనడం జరిగింది రాంబాబు. ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తే దర్శక రచయితలకు కూడా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందంటూ కూడా డైరెక్ట్ గా త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చారు.. బ్రో ప్రొడ్యూసర్ మాట్లాడితే రాంబాబువి గాలి మాటలే ఆయన మాటలని తాను సీరియస్గా తీసుకోవడం లేదు.. ఒకవేళ అలా తీసుకున్నట్లయితే లీగల్ గానే అంబాటిని ఎదుర్కొనే వాడిని అంటూ విశ్వప్రసాద్ తెలియజేశారు.

తన మీద ఎవరు ఎక్కడ కంప్లైంట్ చేసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదని తన సొంత డబ్బుతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని ఈ సినిమా మేకింగ్ లో తాను ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపారు. రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్ పైన అంబాటి బురద జల్లుతున్నారంటూ కూడా తెలియజేయడం జరిగింది. రాంబాబు గారు చేసిన కామెంట్స్ వల్ల సినిమాకు పబ్లిసిటీ పెరుగుతోంది   అంటూ తెలియజేయడం జరిగింది. అంబాటి గారిని ఉద్దేశించి షాంబాబు క్యారెక్టర్ ని తాము సినిమాలో పెట్టలేదని నిర్మాత విశ్వప్రసాద్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: