పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయపరంగా తన ప్రసంగాలతో ఊపేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన బ్రహ్మ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ సైతం నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తరువాత తన. తదుపరి సినిమాలను లైన్లో పెట్టాడు పవన్ కళ్యాణ్ .

పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు హరిహర వీరమల్లు ఓ జి ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమా ఇప్పటిలో రావడం కష్టమే అని అంటున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందే ఓ జి మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. ఉస్తాద్  భగత్ సింగ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్  స్పీడ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్స్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాతో పాటు పవన్ ఓజి అనే సినిమా కూడా చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కంటే ఎక్కువ పూర్తయినట్లుగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ చకచగా పూర్తవుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా నుండి త్వరలోనే గ్లిమ్ప్స్  విడుదల చేయబోతున్నారంట. అంటే ఉస్తాద్ సినిమా కంటే ఓ జి సినిమా ముందుగా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: