టాలీవుడ్ లో రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో సామజ వరగమన సినిమా కూడా ఒకటి. శ్రీ విష్ణు హీరోగా అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వర్షం కురిపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా ద్వారా రేబా మౌనిక జాన్ అనే ఒక కొత్త హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే రేబా మౌనిక జాన్ అందరి మనసులను దోచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరు రేబా మౌనిక జాన్ బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది ఎవరికీ పెద్దగా తెలియదు. దీంతో అందరూ ఈమె గురించి

 ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రేబా మౌనిక జాన్ బెంగళూరులోని మలయాళీ కుటుంబానికి చెందినట్లుగా తెలుస్తోంది. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రేబా మౌనిక జాన్ మోడల్ గతన కెరియర్ నీ ప్రారంభించింది. చాలా ప్రకటనల్లో.కూడా నటించింది  రేబా మౌనిక జాన్ . 2016లో జాకో వింటే స్వర్గరాజు అనే ఒక మలయాళ సినిమాలో నటించి ఎంట్రీ  ఇచ్చింది రేబా మౌనిక జాన్.  మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. దాని తరువాత ఆమెకి ఇవ్వాల్సిన అవకాశాలు వచ్చాయి విజయ దళపతి నయనతార కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా విజిల్ లో

కూడా యాసిడ్ బాధితురాలుగా నటించింది రేబా మౌనిక జాన్. ఈ సినిమా సమయంలోనే నయనతార కి ఆమె బాగా క్లోజ్ అయింది. అంతేకాదు  నయనతార మరియు విగ్నేష్ పెళ్లికి కూడా వచ్చింది రేబా మౌనిక జాన్. అన్నట్లు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రేబా మౌనిక జాన్ కి వివాహం కూడా జరిగింది. 2022లో తన ప్రియుడు జామున్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది రేబా మౌనిక జాన్. ప్రస్తుతం అటు మ్యారేజ్ లైఫ్ తో పాటు ఇటు ఫిలిం కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేస్తోంది. దీంతో ఈమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: