గత కొంతకాలంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరియు తన మూడవ భార్య రమ్య రఘుపతి కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఏడాది తర్వాత కోర్టు ఇటీవల దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నరేష్ మరియు పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె కోర్టుకు వెళ్లిన సంగతి కూడా తెలిసింది. దాంతోపాటు నరేష్ ఇంట్లోకి అనుమతి పైన న్యాయం చేయాలని ఆమె కోరింది. ఇక దీనిపై కోర్టు తీర్పు వెల్లడించింది సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన సినిమాను అడ్డుకునే అధికారం లేదని సినిమాకు లైన్ క్లియర్ చేసింది. దానితోపాటు నరేష్ ఇంట్లోకి కూడా రమ్య రఘుపతి ఎంట్రీని ని

షేధిస్తూ తీర్పుని ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే నరేష్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ తన మూడో భార్య రమ్య రఘుపతి పై కొన్ని సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ చాలా అప్పులు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు అప్పులు ఇచ్చిన వారు తమ ఇంటికి కూడా వస్తున్నారు అని.. అది మా కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. అందుకు తమకు కోర్టు నుంచి రక్షణ కావాలని తెలిపారు. అంతేకాదు రమ్యకు తమ ఇంట్లోకి ప్రవేశం లేదని బెంగళూరు కోర్టు స్పష్టం చేసిందని.. కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానితోపాటు ఆర్డర్ కాపీలో తను రమ్య ఇద్దరు విడిగానే ఉన్నారని

 విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అది కూడా ఆరేళ్లుగా వారిద్దరూ కలిసి ఉండడం లేదని నిర్ధారించుకోవచ్చు అని చెప్పారు. న్యాయస్థానం తీర్పుతో డివైస్ కు మార్గం సులువైందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక విడాకులకు సంబంధించి ఆయన ఇప్పటికే కూకట్పల్లి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇందుకు న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు 2023 ప్రారంభంలోనే నరేష్ ఈ పిటిషన్ను వేసినట్లుగా తెలుస్తోంది. ఇక నరేష్ మరియు పవిత్ర రిలేషన్షిప్ పై స్పందిస్తూ తమ గురించి చాలామంది పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారని తమ పర్సనల్ లైఫ్ పై అందరూ కామెంట్స్ చేయడం బాధగా ఉంది అని ఈ సందర్భంగా చెప్పకు వచ్చారు నరేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: