తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఫేమస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు ఆయన జంపింగ్ జపాన్ అనే నేతగా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఈమధ్య ఫేమస్ అయిన ఈయన తన పంచులతో బాగానే అలరిస్తూ ఉన్నారు మంత్రి మల్లారెడ్డి.. అయితే పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపించిన చిట్ఫండ్ నడిపించిన కష్టపడి సక్సెస్ అయిన అని మంత్రి మల్లారెడ్డి ఆమధ్య చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మల్లారెడ్డి సీరియస్ గా సాగే అసెంబ్లీలో కూడా తన మాటలతో బాగా అందరిని నవ్విస్తూ ఉంటారు.


పొలిటిషన్ గా తనకంటూ ఒక సపరేటు మార్పుని ఏర్పరచుకున్న మల్లారెడ్డి సినిమా నిర్మాణం వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ విషయాన్ని ఆయన చాలా కాలం క్రితమే ప్రకటించడం జరిగింది. ఆ మధ్య తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగిన క్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా తర్వాత అందరూ ఎక్కువగా ఓటీటి ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. తాను కూడా ఓటిటి సంస్థ ఏర్పాటు చేసి పలు సినిమాలను చేస్తానని కామెంట్స్ చేయడం జరిగింది.


అంతేకాకుండా మల్లారెడ్డి చిరంజీవితో తన మొదటి సినిమా చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది మీతో కలిసి కార్మికుల కోసం ఒక సినిమా చేస్తున్నానని మల్లారెడ్డి కామెంట్ చేస్తే చిరంజీవి కూడా అందుకు ఓకే చెప్పేశారు అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఒక సంవత్సరంలో ఆయన నాలుగు సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మల్లారెడ్డి తెలుస్తోంది. ఇక ఆ నాలుగు సినిమాలు కేవలం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే తెలంగాణ భాషలోనే తెరకెక్కిస్తానని తెలియజేసినట్లు తెలుస్తోంది మొత్తం మీద ఈ అంశమైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరి ఏ మేరకు మల్లారెడ్డి సక్సెస్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: