తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల బర్తడే వేడుకలకు ఏదైనా స్పెషల్ డే వేడుకలలో ఇలా చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేయడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ కాగా ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఖుషి మాత్రమే నిలిచింది.. ఆ తర్వాత స్థానం సింహాద్రి ,ఆరంజ్ సినిమాలు ఉన్నాయి.


ఇటీవలే తమిళ హీరో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని కూడా రీ రిలీజ్ చేయగ ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంటోంది.  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా కూడా రి రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 9వ తేదీన మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా రూ .1.36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇక యూఎస్ఏ లో అయితే ఇప్పటివరకు 2,090 టికెట్లు అమ్ముడు పోగా 51 షోల నుండి ఇంత పాపులారిటీ పెరిగిపోయిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రంతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మహేష్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. బుకింగ్స్ లో 58% వరకు ఆక్యు పెన్సితో భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న  బిజినెస్ మెన్ సినిమా ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా రీ రిలీజ్ ద్వారానే కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సినిమాలు విషయానికి వస్తే గుంటూరు కారం సినిమాతో పాటు రాజమౌళితో ఒక సినిమాని చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: