టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు మరోవైపు పలు వాణిజ్య ప్రకటనలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. దాంతోపాటు భారతదేశంలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో కూడా ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ భాష మహేష్ బాబు సంవత్సరానికి ఒక సినిమాలో నటిస్తూ ఉంటారు. అందుకే అంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. దాంతోపాటు రకరకాల బ్రాండ్ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తూ భార్యా పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు. 

స్టార్ హీరో మాత్రమే కాదు మంచి మనసున్న హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. అయితే తాజాగా మహేష్ బాబు ఒక ఖైది అయిన కారుని కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన రేంజ్ రోవర్ కారు తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అందరూ  అయితే బ్లాక్ లేదా బ్లాక్ వైట్ కలర్ తీసుకుంటూ ఉంటారు. కానీ మహేష్ బాబు మాత్రం గోల్డ్ కలర్ కారును తీసుకున్నారు. అయితే ఆ కారు కోసం 5.4 కోట్లు రూపాయలను చెల్లించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇది రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్ అని అంటున్నారు. రేంజ్ రోవర్ అంటే మహేష్ బాబు కే కాదు చాలామంది స్టార్ హీరోలకి కూడా ఇష్టం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్యతో పాటు చాలామంది నటీనటుల దగ్గర ఈ రేంజ్ రోవర్ కారు ఉంది.ఇక ఇప్పటికే మహేష్ బాబు వద్ద రేంజ్ రోవర్ రోగ్ కారు ఉంది. తాజాగా ఇప్పుడు గోల్డ్ ఎడిషన్ కారును కొన్నాడు. మహేష్ బాబు ఇప్పటికే ఆయన దగ్గర చాలా లగ్జరీకార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ తోపాటు చాలా రకరకాల కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఈ రేంజ్ రోవర్ కొత్త కారు కూడా ఆ కార్ల లిస్టులోకి చేరింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: