అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరును మేకర్స్ పరిశీలించారట. అభినయ ప్రధాన పాత్ర ల్లో సాయిపల్లవి అద్భుతం గా చేయడం తో పాటు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మొదట ఆమె పేరును పరిశీలించడం జరిగింది. అయితే సాయితేజ్ కు అదే సమయం లో యాక్సిడెంట్ అయ్యి కోలుకుంటున్న నేపథ్యం లో సాయితేజ్, సాయిపల్లవి కలిసి నటిస్తే సాయి పల్లవి డామినేట్ చేసే ఛాన్స్ ఉందని మేకర్స్ భావించారట.ఈ రీజన్ వల్లే సాయిపల్లవిని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చింది. అయితే సాయితేజ్, సాయి పల్లవి కాంబో బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విరూపాక్ష సీక్వెల్ లో సాయి పల్లవి ని తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విరూపాక్ష సీక్వెల్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచారం లోకి వస్తున్నాయి.
అయితే సీక్వెల్ సెట్స్ పైకి వెళితే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. విరూపాక్ష మూవీకి సీక్వెల్ అంటే ఆ సినిమా విరూపాక్ష1 ను మించి ఉండాలి. విరూపాక్ష సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన నేపథ్యంలో విరూపాక్ష2 మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.