టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ములకు కేరాఫ్ అడ్రస్ చిరంజీవి సోదరులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఈవెంట్ ద్వారా వారందరూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెడుతూనే ఉంటారు. చిరంజీవి మాటని జవదాటని తమ్ముళ్లుగా నాగబాబు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇలాంటి వీరు ఒకరి ఒకరు ఎప్పుడు ఒక్క మాట అనుకుంది లేదు. ఇలా మీరు ఒకానొక సమయంలో చిరంజీవికి ఎదురు తిరిగారిట. ఇక అసలు విషయం ఏంటంటే చిన్నప్పటినుండి పవన్ కళ్యాణ్ కి ఏదో చదువు మీద ఇటు సినిమాల పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదుట. 

ఎప్పుడు కూడా ఏదైనా చిన్న జాబ్ చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి అన్న ఆలోచనలు పవన్ ఉండేవారట. కానీ చిరంజీవి మాత్రం తాను హీరో అయ్యాక తన తమ్ముడిని కూడా హీరో చేయాలని భావించి అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారట. పవన్ కళ్యాణ్ కోసం కథలను వెతుకుతున్న సమయంలోనే ఎంతమంది దర్శకులు చిరంజీవికి కథలు చెప్పారట. కానీ ఏ కదా కూడా పవన్ కి నచ్చలేదట. 

అలా కథలని రిజెక్ట్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కి ఒకరోజు కోపం వచ్చి అసలు ఏంటన్నయ్య ఈ పరిస్థితి ఇలా ఎన్ని రోజులు కథను రిజెక్ట్ చేసుకుంటూ పోవాలి నేను సినిమాలు చేయకపోయినా పర్వాలేదు నేను సన్యాసం తీసుకుని బౌద్ధమతంలోకి వెళ్తాను అంటూ చిరంజీవికి చెప్పారట పవన్ కళ్యాణ్ .అన్నట్టుగానే మరునాడు పారిపోయి మద్రాసు వెళ్లిపోయారట పవన్. ఇక విషయం తెలుసుకున్న చిరంజీవి తమ్ముడు ఎక్కడున్నాడో వెతికించి మరి ఇంట్లో బంధించారట. బయటికి వెళ్ళకూడదు అని కండిషన్ పెట్టి నాగబాబును కాపలాగా ఉంచేవారట. దాని తర్వాత ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: