
అయితే ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటైన జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇలా పెళ్లి చేసుకున్న జంటలు ఆ తర్వాత మనస్పర్ధలతో కొన్నాళ్లకే విడిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న రణవీర్ సింగ్.. దీపిక పదుకొనే జంట కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయాన్ని ఇక ఆ జంట ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇటీవల వైవాహిక జీవితం గురించి హీరోయిన్ దీపికా పదుకొనే పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిపోయింది. బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే.. జీవితం బాగుంటుంది అంటూ ఒక కోట్ ని షేర్ చేస్తూ భర్త రణబీర్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనతో కలిసి నవ్వే వారు.. నవ్వించేవారు.. ఏడిపించేవారు కూడా ఉండాలి. అలాంటి వారితో ప్రేమ ఎప్పటికీ కలుషితం కాదు అంటూ దీపిక పదుకొనే ఒక కోట్ పెట్టగా.. రణవీర్ సింగ్ స్పందిస్తూ లవ్ ఎమోజీలను పోస్ట్ చేశారు.