కోలీవుడ్లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గత కొంతకాలంగా రజనీకాంత్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నష్టాలనే మిగులుస్తున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా తన సక్సెస్ తో తన స్టామినా చూపించాలని రజనీకాంత్ ఆలోచించి మరి జైలర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈనెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గత కొన్ని వారాల ముందు వరకు పాజిటివ్ బజ్ ఏర్పడలేదు. కానీ మెల్ల మెల్లగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకి హైప్ ఏర్పడుతోంది.


దీనికి తోడు ట్రైలర్ కి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ క్రియేట్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా బాగా గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. జైలర్ సినిమా విడుదల ముందు నుంచే థియేట్రికల్ గా ఎంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏరియా వైజ్ గా చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా దాదాపుగా  రూ.60 కోట్ల రూపాయల వరకు ధర పరికినట్లుగా తెలుస్తోంది.

కర్ణాటకలో రూ .10 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో  రూ.12 కోట్ల రూపాయలు కేరళలో రూ.5.5 కోట్ల రూపాయలు రెస్ట్ ఆఫ్ ఇండియా పరంగా చూసుకుంటే రూ .4 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఇండియా మొత్తంలోనే జైలర్ సినిమా రూ .91 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో రూ .32 కోట్లు పలకగా ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.124 కోట్ల రూపాయలు జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి దాదాపుగా రూ .250 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. గత చిత్రాలు మాత్రం రజనీకాంత్ సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదని సమాచారం ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: