కెరియర్ క్లైమాక్స్ కి వచ్చింది అని అనుకుంటున్న సమయంలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక సంచలనాన్ని సృష్టించింది అని చెప్పాలి .ఈ వారం తనకు మరింత ప్రత్యేకంగా మారబోతుంది. ప్రస్తుతం ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ లతో కలిసి ఒకేసారి నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఈ రెండు సినిమాలో వర్కౌట్ అవుతాయి అనే నమ్మకంతో ఉంది తమన్న. అయితే జైలు సినిమాలో తమన్నా ఫుల్ లెన్త్ హీరోయిన్ కాదని అంటున్నారు. హీరో పాత్ర వయసు దృష్ట్యా రజనికి జోడిగా రమ్యకృష్ణ కూడా ఇందులో ఉంది అన్న సమాచారం వినబడుతోంది. 

అయితే చాలా కాలం తర్వాత జైలు నుండి వచ్చే క్రమంలో తమన్నా ఐటెం సాంగ్ ఉంటుంది అని అంటున్నారు. దీంతోపాటు కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా తమన్నా ఉంటుందట. ఇక భోలశంకర్ సినిమా విషయానికి వస్తే ఫుల్ లెన్త్ రోల్ కాబట్టి దానికి ఫలితం మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని తమన్న . ఇక ఇటీవల ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ టు మరియు జీ కర్త వంటి సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఒకసారి గా షాక్ ఇచ్చింది. ఇక దీంతో ఆమెకి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఆ సినిమాల తర్వాత బడా షోరూమ్ ఓపెనింగ్ లు దర్శక నిర్మాతలతో స్టోరీ

డిస్కషన్లు ఒకటా రెండా ఇంకో మూడేళ్ల దాకా ఫుల్ బిజీ కాబోతోంది తమన్నా. తెలుగు తమిళ అవకాశాలు వరుసగా వస్తువు ఉండడంతో ప్రస్తుతం బిజీగా మారింది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి మలయాళం లో బాంద్రా హిందీలో వేద తమిళంలో అర్న్మై 4 సెట్స్ పై ఉన్నాయి. అయితే ఇంతకుముందు చేసిన వెబ్ సిరీస్ ల కొనసాగింపుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు టాలీవుడ్ కొత్త ప్రాజెక్టులు కూడా చేశా అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: