డైరెక్టర్ సిద్ధిఖీ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ ,హిట్లర్, బిగ్ బ్రదర్, కాబూలీ వాల తదితర చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించారు. ఈ డైరెక్టర్ స్క్రీన్ రైటర్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలకు సేవలు అందించారు. తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఈయనతో చాలా అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నితిన్, మీరా చోప్రా జంటగా నటించిన మారో సినిమాని సిద్ధిఖీనే దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పాటు చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా కథ కూడా ఈయనే అందించినట్లు తెలుస్తోంది.
అలాగే తెలుగు, తమిళ భాషలలో భారీ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ చంద్రముఖి మాతృక మలయాళ సినిమా మనిచంద్రికకు కూడా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశారు సిద్ధిఖీ. బాలీవుడ్లో రెండు సినిమాలు తమిళంలో ఐదు సినిమాలు మలయాళం లో 20 పైగా సినిమాలలో నటించిన ఈయన నటుడు మోహన్లాల్ సిద్ధికి మంచి స్నేహితులట. అయితే డైరెక్టర్ సిద్ధికి మరణ వార్త తెలియగానే మలయాళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది దీంతో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు.