సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్గా పరిచయం చేయనవసరం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి క్రేజీ ఉందో తెలిసిన విషయమే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సినీ సెలెబ్రేటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మహేష్ బాబు భార్య నమ్రత కూడా చాలా డిఫరెంట్గా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. మహేష్ కానీ నమాత కానీ వారి పర్సనల్ ఫోటోలను ఇప్పటివరకు షేర్ చేయడం చాలా తక్కువగానే చూసే ఉన్నాము.
అప్పుడెప్పుడో గతంలో ఒకసారి నమ్రతాను కిస్ చేస్తున్న ఫోటోని మహేష్ బాబు షేర్ చేయడం జరిగింది.ఇప్పుడు తాజాగా మహేష్ ను వెనుక నుంచి హత్తుకొని ఉన్న ఫోటోతో మహేష్ బాబుకి బర్తడే విషెస్ తెలియజేస్తూ ఉన్నది నమ్రత. ఈ ఫోటో చాలా రొమాంటిక్గా ఉందని మహేష్ ని ఆమె ప్రేమగా MB అని పిలుచుకుంటున్నట్లు క్యాప్షన్ లో తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదలకు సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది.


మహేష్ ఈసారి మాస్ లుక్కుతో మరొకసారి అభిమానులను మెప్పించడానికి సిద్ధమయ్యారు అయితే ఈ సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోవడంతో పాటు హీరోయిన్లు కూడా కొన్నిసార్లు మారడం వల్ల కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ బర్తడే సందర్భంగా కనీసం సినిమా టీజర్ ట్రైలర్ కూడా విడుదల చేయలేదని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కేవలం ఒక సింగిల్ పోస్టర్ను మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా మొదలు కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: