
‘జైలర్’ మూవీ మ్యానియాతో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడకనిపిస్తోంది. తాను నటించే సినిమాకు 80 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే రాజానీకాంత్ ఈ మూవీ ఫలితం గురించి పట్టించుకోకుండా ఇప్పుడు హీమాలయాలకు వెళ్ళి అక్కడ మూడు రోజులు ధ్యానంలో గడుపుతూ ఉండటం కాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది.
ఒకప్పుడు విపరీతమైన విలాసాలాతో జీవితాన్ని గడిపిన రజనీకాంత్ కు హిమాలయాలు వెళ్ళడం అలవాటు అయిన దగ్గర నుండి చాల ప్రశాంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు అని ఆతడి సన్నిహితులు అంటారు. కనీసం రోజుకు రెండు గంటలు ధ్యానం చేయకుండా తన దైనందిన కార్యక్రమాలాను మొదలుపెట్టని రజనీకాంత్ తాను నటించే సినిమాలలో వీలైనంతవరకు అశ్లీల పదాలు అశ్లీల సన్నివేశాలు లేకుండా చూసుకుంటాడు.
తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయాలని ఒక రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికలలో పోటీ చేయకుండా ఆ రాజకీయ పార్టీని రద్దు చేసుకున్నప్పటికీ తమిళనాడులో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో కొనసాగుతున్న రజనీకాంత్ మ్యానియాను ‘జైలర్’ మరొకసారి రుజువు చేస్తోంది. 70 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ అదేవిధంగా అనేక అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నప్పటికీ రజనీ మ్యానియా పతాక స్థాయిలోనే కొనసాగుతోంది. ఎప్పుడు లేని విధంగా ప్రియ మిత్రులైన రజనీకాంత్ చిరంజేవీ ల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీ పడటం ఈసారి ప్రత్యేకత. ఈ పోటీలో విజేత ఎవరు అన్నది తెలియాలి అంటే ఈ లాంగ్ వీకెండ్ ముగిసే వరకు ఎదురు చూడాలి..