సోషల్ మీడియాలో వార్తలు చూడకుండా ఒక్క రోజు కూడ గడవని పరిస్థితి  అందరికీ ఏర్పడింది. ఈపరిస్థితుల మధ్య లేటెస్ట్ గా  సోషల్ మీడియాలో తరుచూ వినిపిస్తున్న పదం  ‘క్రింజ్ మూవీ’. ‘భోళాశంకర్’ మూవీ కూడా ‘క్రింజ్ మూవీ’. అంటూ వస్తున్న విమర్శల పై ఈమూవీ దర్శకుడు మెహర్ రమేష్ తనదైన రీతిలో స్పందించాడు.    



ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్థం తెలియకుండా చాలా పదాలు వాడుతున్నారని  అలాంటి పదాలలో ‘క్రింజ్’ కూడ ఒకటి అని కామెంట్ చేసశాడు. సంక్రాంతి రేస్  కు విడుదల అయిన ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ అలాగే ‘ఆదిపురుష్’ సినిమాలకు కూడ ఇలాంటి పదాలు వాడారని ఇప్పుడు అదే ట్రెండ్ ‘భోళాశంకర్’ కు కూడా కొనసాగుతోంది అంటూ తనదైన రీతిలో స్పందహించాడు.  



‘వేదాళం’ సినిమాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుని కధలో అనేక మార్పులు చేసిన ‘భోళాశంకర్’ అందరికీ నచ్చుతుంది అంటున్నాడు.  మెగాస్టార్ తో సినిమా తీయడం అన్నది తన జీవితపు కల అంటూ గత మూడేళ్లుగా తాను ఈ మూవీ ప్రాజెక్టు పైనే ఉన్నాను అంటున్నాడు.



‘భోళాశంకర్’ మూవీని ఎలా తీస్తే ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతారో ఆవిధంగా ఆలోచించి తాను ఆసినిమాను తీశాను అంటూ ఉమెన్ ట్రాఫికింగ్ అన్న సబ్జెక్ట్ ఎప్పుడు తీసినా ప్రేక్షకులు కనెక్ట్  అవుతారు అన్న నమ్మకం తనకు ఉంది  అంటున్నాడు. రీమేక్ లు తీయడం ఇండస్ట్రీలో కొత్త కాదని అక్కినేని ఎన్టీఆర్ లు కూడ రీమేక్స్ లో నటించిన సందర్భాన్ని గుర్తుకు చేశాడు. రజనీకాంత్ ‘జైలర్’ తో పోటీ పడుతున్న మెగా స్టార్ మూవీ పట్ల ఇంకా సగటు ప్రేక్షకులలో మ్యానియా ఏర్పడలేదు అని అంటున్నారు. అయితే ఈ మూవీకి ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలక్షన్స్ కు ఎదురు ఉండదు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ రేస్ లో ఎవర్ని గెలిపిస్తారో వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: