భారీ యాక్షన్ ఫ్యాక్షన్ డ్రాప్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చివరిగా గోపీచంద్ రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాదాపుగా గోపీచంద్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతోంది. భిమా సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాలలో రాజనగరం అద్దరిపేటలో షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్లకు సంబంధించి ఒక అప్డేట్ సైతం విడుదల చేసినట్లు తెలుస్తోంది మేకర్స్.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియా భవాని శంకర్ నటిస్తూ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రియ భవాని శంకర్ తెలుగులో సంతోష్ శోభన్ తో కలిసి నటించిన ఈమె అలాగే సత్యదేవత కలిసి జీబ్రా సినిమాలో కనిపించింది ప్రియా భవాని తో పాటు మరొక హీరోయిన్ మాళవిక శర్మ కూడా ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో నైనా అటు ప్రియ భవాని శంకర్ కెరియర్ గోపీచంద్ కెరియర్ మారుస్తుందేమో చూడాలి మరి. తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలో నటించిన గోపీచంద్ ఈసారి కూడా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.