ముఖ్యంగా ఒకరోజు వారి చిత్రాలను డూడుల్ గా ఉంచుతూ.. వారి యొక్క విశేషమైన కీర్తిని మరొకసారి గుర్తు చేస్తోంది గూగుల్. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలాంటి గౌరవాన్ని అందుకున్నారు. అయితే ఇలాంటి గౌరవం అందుకున్న భారతీయులు చాలా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. అయితే తాజాగా అలనాటి అందాల తార తెలుగు నటి శ్రీదేవికి ఈ అరుదైన గౌరవం లభించింది. ఈరోజు ఆమె జయంతి కావడంతో గూగుల్ ఆమె ఫోటోను డూడుల్ గా పెట్టింది.
ముంబై కి చెందిన ప్రముఖ అతిధి కళాకారిణి భూమిక ముఖర్జీ చిత్రీకరించిన నేటి డూడుల్ భారతీయ నటి శ్రీదేవి 60వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక ఈ డూడల్ ప్రతి ఒక్కరిని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. శ్రీదేవి విషయానికి వస్తే 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించిన ఈమె 4000 వయసులోని తమిళ చిత్రం కందన్ కరుణై అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ఆరంభించి ఆ తర్వాత దక్షిణాది భారతీయ భాషలను మాట్లాడడం కూడా నేర్చుకుంది. ఇక తన కెరియర్ ఆరంభంలోనే తమిళ్ , తెలుగు, మలయాళం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత హీరోయిన్ గా మారి సత్తా చాటింది. అటు సినిమాలు ఇటు టెలివిజన్ షోలలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.