ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బెల్లీ డాన్స్ కు పెట్టింది పేరు.. గతంలో కూడా పలు తెలుగు చిత్రాలలో తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. బాహుబలి వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇందులో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందేసింది. అయితే ఇప్పుడు మట్కా కోసం రెండోసారి వరుణ్ తేజ్ తో కలిసి డాన్స్ చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమాతో పాటు మరొకవైపు పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబో లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో మహారాణి పాత్రలో కనిపించబోతుందట. ఔరంగజేబు చెల్లెలి పాత్రలో ఈమె కనిపించనున్నట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకోగా.. కొన్ని అనుకోని కారణాలవల్ల ఆమె స్థానంలో నోరా ఫతేహిని తీసుకోవడం జరిగింది. మరికొన్ని వెబ్ సిరీస్, టెలివిజన్ రియాల్టీ షోలలో కూడా పనిచేస్తున్న ఈమె ప్రస్తుతం హిప్ హాప్ ఇండియా సీజన్ 1 షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.