పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్లు దాటింది. ఇప్పటివరకు కేవలం 21 సినిమాల్లో మాత్రమే నటించాడు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ప్రభాస్ చాలా హేక్టిక్ షెడ్యూల్స్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు షూటింగ్ నుండి పెద్ద విరామం తీసుకోబోతున్నాడట ప్రభాస్. ఇక ఆది పురుష్ సినిమా తర్వాత ఆయన సలార్ కల్కి సినిమాల మీద తన ఫోకస్ ని పెట్టాడు.

ఇక ఈ సినిమాలతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని గట్టి నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాలో షూటింగ్ దాదాపుగా పూర్తి చేసి ప్రభాస్ ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్లకు గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. అయితే ప్రభాస్ అనారోగ్యం సమస్యల వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుబోతున్నట్లుగా తెలుస్తోంది. కంటిన్యూ షూటింగ్స్ ఎక్సర్సైజ్ లతో పాటు తదితర కారణాల వల్ల ప్రభాస్ కు మోకాలు నొప్పి వచ్చింది. ఇక డాక్టర్ సలహాల మేరకు మోకాలికి ఆపరేషన్ చేయించాలని సూచించారు. డిసెంబర్ కల్లా కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసి దాని తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్ లోని

ఒక ప్రముఖ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. ఇక సర్జరీ అనంతరం కనీసం ఏడాది పాటు సినిమాలకి లాంగ్ బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడట. అయితే కల్కి సినిమాతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలకి కమిట్ అయ్యాడు. కానీ అనారోగ్యం కారణం వల్ల ఆ సినిమాలన్నీ కూడా ఆలస్యం అవుతూ వస్తున్నాయి. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. దాని తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగతో కూడా ఒక సినిమా చేయాల్సింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయవలసి ఉంది. ఇక ఆయన అనారోగ్యం కారణంగా ఈ మూడు సినిమాలు కూడా ఆలస్యం అవుతూ వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: