భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా. తాజాగా ఈ సినిమాపై ఇప్పుడు మరొక వివాదం మొదలైంది అని అంటున్నారు. అయితే ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవికి అసలు రెమ్యూనరేషన్ లేదని ఒకరు.. తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారని మరొకరు.. తన పూర్తి రెమ్యూనరేషన్ కావాల్సిందే అని.. ఇంకొకరు ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మూడు రోజులు కలిపి కేవలం 25 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్కు మరొక 55 కోట్ల దూరంలో ఉంది ఈ సినిమా. 

అయితే ఇది చాలా అసాధ్యంగా కనిపించడంతో నిర్మాత అనిల్ సుంకర కు మరో డిజాస్టర్ మిగిలించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈమధ్య అఖిల్ తో తీసిన ఏజెంట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో భోళా శంకర విషయంలో చిరంజీవి మరియు అనిల్ సుంకర మధ్య విభేదాలు వచ్చాయి అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై నిర్మాత అనిల్ సుంకరం స్పందించాడని ఒక వాట్సాప్ చాట్ సంబంధించిన స్క్రీన్ షాట్ బయటికి రావడంతో అదికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే అందులో రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదు అని ..తాను చిరంజీవితో మరొక సినిమా చేయబోతున్నాను అని.. సదరు నిర్మాత చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడం కంటే కూడా చిరంజీవి రెమ్యూనరేషన్ విషయంలో నెలకొన్న గందరగోళమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న చిరంజీవి భోళాశంకర్ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అందరూ అనుకున్నారు. కానీ ఇలా అవ్వడంతో మెగా అభిమానులు ఒక రేంజ్ లో నిరాశకు గురయ్యారు. మరోవైపు చిరంజీవి త్వరలోనే మోకాలి సర్జరీకి కూడా వెళ్లబోతున్నాడు అన్న వార్తలు కూడా   సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సర్జరీ తర్వాత చాలా కాలం పాటు మెగాస్టార్ రెస్ట్ కూడా తీసుకోబోతున్నారు అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: