టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి  స్టార్ హీరో లు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఒక స్టార్ హీరో సక్సెస్ కావడం కోసం ఆ ఫ్యామిలీలోని ప్రతి హీరో కూడా ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీలో ఏ హీరో మూవీ ప్రమోషన్స్ కు సహాయం కావాలి అన్నా మెగా హీరోలు కచ్చితంగా అందుకు ముందు ఉంటారు. వారి సినిమా ప్రమోషన్స్లో వివరించి సినిమాపై హైప్ పెంచుతూ ఉంటారు మన మెగా హీరోలు. అయితే అసలు విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సిని ఇండస్ట్రీకి హీరోగా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 

ఎంతో కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. తనదైన స్టైల్ తో కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దాని తర్వాత ఇప్పుడు మళ్లీ సోల్ ఆఫ్ సత్య అనే ఒక మ్యూజికల్ షార్ట్ ఫిలింలో నటించాడు. తన స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ఈ షార్ట్ ఫిలిం వీడియో కి సింగర్ శృతిరంజని సంగీతం అందించింది.

కాగా ఇందులో సాయి ధరంతేజ్ కి జోడిగా కలర్స్ స్వాతి నటించిన  ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోల్ ఆఫ్ సత్య పాటను గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయబోతున్నారు. ఇక ఈరోజు ఉదయం ఈ పాటని లాంచ్ చేయబోతున్నట్లుగా శ్రీ వేంకటేశ్వర శ్రీధర్ క్రియేషన్స్ బ్యానర్ వారు అధికారికంగా వెల్లడించడం జరిగింది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయి ధరంతేజ్ మూవీ సాంగ్ లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: