మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: కొత్త కొత్తగా ఉన్నది.. అవే ప్లస్?

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోహైల్ నేడు 'మిస్టర్ ప్రెగ్నెంట్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా విషయానికి వస్తే హీరో సోహెల్ గౌతమ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఎమోషన్స్ సీన్స్ లో కూడా అందర్నీ బాగా కనెక్ట్ చేసాడు. హీరోయిన్గా నటించిన రూప కొడువాయుర్ కూడా తన పాత్రతో చాలా బాగా ఆకట్టుకుంది. తను కూడా లవ్ సీన్స్ లో ఎమోషనల్ సీన్స్ లో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. డాక్టర్ వసుధ పాత్రలో నటించిన సుహాసినికి కూడా ఈ పాత్ర ద్వారా చాలా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. మిగిలిన నటీనటులంతా కూడా తమ పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ మూవీ డైరెక్టర్ డిఫరెంట్ కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇక శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు పరవాలేదు. 


బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కెమెరా పనితనం కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.ఇక సినిమా మొదట మామూలు కథతో స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. అసలు హీరోయిన్ హీరోని ఎందుకు అంత ఇష్టపడింది అనే విషయాన్ని మాత్రం చూపించలేదు. ఫస్ట్ 45 నిమిషాలు అసలు కథ సాగినట్లుగా అనిపించదు. ఇక ఎప్పుడైతే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అప్పటినుంచి అసలు స్టోరీ మారిపోతుంది. ఇక హీరో పిల్లల్ని వద్దనుకున్న విషయాన్ని మాత్రం చాలా ఎమోషనల్ గా చూపించారు. ఇంటర్వెల్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక హీరో ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత అతడికి ఎదురైన అవమానాలు ఇంకా వాటి వల్ల పడిన బాధలను బాగా చూపించారు. ఇక ఆడవారి గొప్పతనం గురించి కూడా క్లైమాక్స్ లో చాలా బాగా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: